రేపు నగరంలోని పాలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

water bundh
water bundh

హైదరాబాద్‌ : 33 కేవీ మంజీరా ఫీడర్‌, 132 కేవీ ఆర్సీపురం, 132 కేవీ పాశంమైలారం ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు మరమ్మతుల నేపథ్యంలో రేపు  పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ మరమ్మతుల కారణంగా బీహెచ్‌ఈఎల్‌ ప్యాక్టరీ, మాక్స్‌ సొసైటీ-1, 2, అశోక్‌నగర్‌ హెచ్‌ఐజీ, హెచ్‌సీయూ, ఎస్‌బీఐటీ, మదీనాగూడ, హెచ్‌ఐజీ, పి.సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌, మియాపూర్‌, ఆర్సీపురం, అశోక్‌నగర్‌, చందానగర్‌, అమీన్‌పూరా, హుడాకాలనీ, పీజేఆర్‌ కాలనీ, దీప్తిశ్రీనగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గురువారం మంచినీటి సరఫరా ఉండదని వాటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.