రేపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

TRS BAHWAN
TRS BAHWAN

Hyderabad: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మెరుపువేగంతో దూసుకెళ్లిన కారు 88 స్థానాలలో విజయదుందుభి మ్రోగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలే దక్కించుకోగా రేపు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 88 ఎమ్మెల్యేలు హాజరై టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.