రెండు పడకల గదుల ఇళ్లకు మంత్రి శంఖుస్థాపన

TS Minister Tummala
TS Minister Tummala

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో రెండు పడకల గదుల ఇళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరారావు నేడు శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భక్త రామదాసు పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపుతామని తెలిపారు. ఉగాది నాటికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు. మార్చిలో రైతులందరికి పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు.