రిట్‌పిటిషన్‌ కొట్టివేత

HCFF
High Court

రిట్‌పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి.. కాళేశ్వరంప్రాజెక్టు ఆపాలంటూ వేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.. సుందిళ్ల బ్యారేజీ కోసం చట్టప్రకారమే భూసేకరణ జరిగిందని తెలిపింది.. ప్రతి విషయానికి కోర్టు మెట్లుఎక్కటం పట్ల హైకోర్టు విస్మయం చెందింది.. భూసేకరణ ఆథారిటీకి అభ్యంతరాలు తెలపాలని న్యాయమూర్తి వెల్లడించారు.. భూసేకరణను అడ్డుకోవటం తప్ప వేరే పనిలేదా అంటూ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. తప్పుడు వాదనలు, అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృధా చేస్తున్నారని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.