రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టెందుకు ముందుకొచ్చిన బిన్ జాయెద్ గ్రూప్

bin jatedu group, telangana govt
bin jatedu group, telangana govt

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన బిన్ జాయెద్ గ్రూప్ ముందుకొచ్చింది. రూ.12,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తెలంగాణలో మౌలికరంగ ప్రాజెక్టులపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందంపై పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, బిన్ జాయెద్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మిద్దత్ కిద్వాయ్ సంతకాలు చేశారు. రాష్ట్రంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్‌లో నిర్మించనున్న గేమింగ్, యానిమేషన్ టవర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ లాంటి మౌలికరంగ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు బిన్ జాయెద్ కంపెనీ ఆసక్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం.