రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం వేగవంతంః తుమ్మ‌ల‌

tummala
tummala

హైద‌రాబాద్ః రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1333 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను గుర్తించామని చెప్పారు. దీని కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతంది. ప్రస్తుతం 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లను రాష్ట్రమే నిర్వహిస్తుంద‌ని మంత్రి తుమ్మ‌ల తెలిపారు.