రాష్ట్రంలో కొత్తగా 71 మున్సిపాల్టీలు!

tummala
tummala

హైదరాబాద్‌: పురపాలక సవరణ బిల్లును ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌ తరఫున రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై రేపు సభలో చర్చించనున్నారు. 41 పట్టణ స్థానిక సంస్థల్లో 136 గ్రామాల విలీనాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్తగా 71 పురపాలికల ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణను ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాల్టీల్లో 173 గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గ్రామ పంచాయితీల గడువు ముగిశాక విలీనం చేస్తూ బిల్లును ప్రతిపాదించారు.