రాజ‌న్న ఆల‌యంలో పొటెత్తిన భ‌క్తులు

Vemulawada Rajanna temple
Vemulawada Rajanna temple

వేములవాడ : వరుస సెలవులు..అందులోనూ సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామునే భక్తులు స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 11 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ భక్తులు గర్భగుడిలో నిర్వహించుకునే ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తులు తలనీలాలను సమర్పించి, తమెత్తు బెల్లాన్ని జోకించి పంచిపెట్టారు. కోడెమొక్కు చెల్లించుకునేందుకు 3 గంటలు, స్వామివారి దర్శనానికి మరో 2 గంటలు పట్టిందని భక్తులు వెల్లడించారు. 70 వేలకు పైగా స్వామివారిని దర్శించుకోగా, సుమారు రూ.23 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు.