రాజ‌కీయాలు విలువ‌ల‌తో కూడిన‌విగా ఉండాలిః కోదండ‌రాం

Kodandaram
Kodandaram

హైద‌రాబాద్ః తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ద్వారా కీలమైన పాత్రను పోషించిన ప్రొ.కోదండరామ్, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ విధానాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఛానల్ తో మాట్లాడారు. రాజకీయాలు విలువలతో కూడినవిగా ఉండాలనీ .. ప్రజల పట్ల నిబద్ధతతో పని చేయాలని అన్నారు. ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ప్రజా ఉద్యమాల నుంచే పుడతాయనీ, అలాంటి ఉద్యమాలను నడిపించే ప్రయత్నం జేఏసీ తరఫున జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావ వ్యక్తీకరణ .. ఆందోళన .. రాజకీయ ప్రక్రియ అనే అంశాలతో, సామాజిక వ్యవస్థలో తాము ఆశించిన మార్పులు తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం కొనసాగుతోన్న పద్ధతుల్లో సమగ్రంగా మార్పులు తీసుకువచ్చే దిశగా జేఏసీ పోరాడుతుందని చెప్పుకొచ్చారు