రాజకీయ నాయకుల భవిష్యత్తుని నిర్ణయించేది విద్యార్థులే: ఎల్‌.రమణ

TTDP President L.Ramana
TTDP President L.Ramana

హైదరాబాద్‌: టీజేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కొలువుల కొట్లాట సభకు విశేష స్పందన లభించింది. విద్యార్థులతో
స్టేడియం మొత్తం నిండిపోయింది. పోలీసు నిర్భంధాలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది విద్యార్థులు సభకు తరలివచ్చారు. ఈ
సభకు హాజరైన టీటీడీపీ నేత ఎల్‌.రమణ మట్లాడుతూ కెసిఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. దగాకోరు పరిపాలనకు చరమగీతం పాడే శక్తి విద్యార్థులకు ఉందని, రాజకీయ నాయకుల భవిష్యత్తుని నిర్ణయించేది విద్యార్థులేనని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ జరుగుతోందని, తెలంగాణలో సహజ సంపద, భూగర్భ సంపదను దోచుకునేవారు, ల్యాండ్‌ మాఫీయా, లిక్కర్‌ మాఫీయాలు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక బాధ పడుతున్నారని కాని కెసిఆర్‌ మాత్రం ఏ చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా టీజేఏసీ ఈ సభను విజయవంతంగా నిర్వహిస్తుందని కొనియాడారు.