యాదాద్రిలో పొటెత్తిన భక్తులు

Yadadri Temple
Yadadri Temple

యాదాద్రి భువనగిరి: యాదయగిరి గుట్టకు భక్తులు పొటెత్తారు. సెలవుదినం కావడంతో యాదాద్ర శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు. దీంతో యాదాద్రి పరిసరాలు జనంతో క్రిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు.