యాదగిరి గుట్ట సెక్స్‌ రాకెట్‌లో కొత్త కోణం

Sexual Abuse
Sexual Abuse

దేశ వ్యాప్తంగా వ్యభిచార ముఠాలతో చైల్డ్‌ మాఫియా లింకు
వేలాది మంది పసి బాలికలను రొంపిలో దించినట్లు ఆధారాలు
యాదగిరి గుట్ట సెక్స్‌ రాకెట్‌లో కొత్త కోణం
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు నగరాలలో దాడులకు పోలీసుల సన్నాహాలు
హైదరాబాద్‌: భువనగిరి యాదాద్రి జిల్లాలోని యాదగిరి గుట్టలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌లో మరో కోణం వెలుగు చూసింది. ఇక్కడి వ్యభిచార గృహాల నిర్వాహకులకు చైల్డ్‌ మాఫియా (పసి బాలలను కిడ్నాప్‌లకు పాల్పడే నేరగాళ్లు)తో సంబంధం వుందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ చైల్డ్‌ మా ఫియా తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ముక్కుపచ్చలారని పసి బాలికలను కిడ్నాప్‌ చేసి దేశ వ్యాప్తంగా వున్న వందలాది వ్యభిచార ముఠాలకు విక్రయించిన ట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇందులో కొందరిని యాదగిరి గుట్టలో గల వ్యభిచార గృహాలకు అమ్మినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల వ్యభిచార గృహాలపై దాడులకు తెలంగాణ పోలీసులు సన్నద్దమవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన యాదగిరి గుట్ట వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు 16 మంది పసి బాలికలను కాపాడిన ఉదంతం రోజుకో కొత్త విషయా లను వెలుగులోకి తేసాగింది. ఇప్పటి వరకు యాదగిరి గుట్టలోని ఒక సామాజిక వర్గం తరతరాలుగా వ్యభిచార వృత్తిలో వుంటుందనే పోలీసులు భావిస్తుండగా తాజా గా బయటపడ్డ సంచలన నిజాలు అన్ని వర్గాలను నివ్వెర పరిచేలా వున్నాయి. వ్యభిచార గృహాలకు విక్రయించబడే వారిలో సాధారణంగా యుక్త వయస్సు లేదా అం తకు పై వయస్సు వున్న వారే వుండడం అందరికి తెలిసిన విషయమే. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు లేకుండా వున్న యువతులకు మాయమాటలు చెప్పి పట్టణాల లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే కొన్ని ముఠాలు ఆనక వారిని వ్యభిచార ఊబీలో దింపుతుండడం విదితమే. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహార ం. దీనిపై గ్రామీణ ప్రాంతాలలో స్వచ్చంద సంస్థలు, సర్కారీ విభాగాలు చైతన్యం తీసుకురావడంతో యువతులకు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకుపోయే ముఠాల ఆగడాలు సాగడం లేదు. ఈ క్రమంలోనే వ్యభిచార ముఠాలకు అమ్మాయిలను తరలించే ముఠాలు బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మహిళలు ఒంటరిగా వుండే ప్రాంతాలలో తిష్టవేసి వారిని కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాయి. వీటిపైనా ఇటీవల కాలంలో పోలీసులు కొరడా జుళిపించడంతో వ్యభిచార గృహాలకు యువతులను విక్ర యించే ముఠాలు కొత్త పంథాను ఎంచుకున్నాయి. పసి బాలికలను కిడ్నాప్‌ చేసే చైల్డ్‌ మాఫియాతో చేతులు కలపి వారి నుంచి పసి పాపలను కొనడం, ఆ తరువాత వీ రిని వ్యభిచార ముఠాలకు అమ్మడం వంటి నీచమైన పనులకు దిగసాగాయి. యాదగిరి గుట్టలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌లో వ్యభిచార రొంపిలో వున్న వారంతా ముక్కుపచ్చలారని బాలికలే కావడం, వీరికి పట్టుమని 15 ఏళ్లు కూడా లేకపోవడం పోలీసులతో పాటు మహిళా, శిశు, బాలికల సంక్షేమ విభాగం అధికారులకు షాక్‌కు గురిచేశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు అనేకచోట్ల సెక్స్‌ రాకెట్‌లు పట్టుబడినా ఇక్కడ వ్యభిచార రొంపిలో వున్న వారంతా మేజర్లే కావడం గమనార్హం. అయితే యాద గిరి గుట్టలో దీనికి భిన్నంగా బలవంతంగా సెక్స్‌ వర్కర్లుగా మారిన వారంతా బాలికలే కావడం, వీరంతా పదేళ్లు అంతకు ముందే తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాం తాలలో కిడ్నాప్‌కు గురవడం ఇప్పుడు మరో సంచలన అంశంగా మారింది. ఇక్కడ పట్టుబడ్డ బాలికలంతా తమ పిల్లలేనని వ్యభిచార గృహాల నిర్వాహకులు చెబుతున్నా బాలికలు మాత్రం ఇదంతా అబద్దమని చెబుతుండడంతో వీరికి డిఎన్‌ఎ పరీక్షలు చేయించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. వీరందరిని ప్రస్తుతం ప్రభుత్వ హోంల కు తరలించి, అక్కడ వైద్య సేవలతో పాటు మంచి భోజన వసతులు అందిస్తున్నారు. ఇదే సమయంలో వీరిని సాధారణ పరిస్థితులకు తెచ్చేందుకు మహిళా వైద్యులు, మనస్తత్వ వైద్యులచే కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. గుట్టలో రక్షించబడిన బాలికలు ఇంకా భయం భయంగానే వుండడం, ఎవరిని చూసినా బెదిరి పోతుండడంతో వారిని సా ధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ బాలికల్లో తమ పిల్లలు వున్నారేమోనని తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది తల్లిదం డ్రులు గుట్టకు రావడం, ఇందులో ఇద్దరు బాలిలకు వారి తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు తెలుగు రాష్ట్రాలలోని చైల్డ్‌ మాఫియాతో లింకులున్నట్లు నిర్దారణకు వచ్చారు. మూడేళ్ల నుంచి ఐదారేళ్ల వయస్సు వున్న బాలికలను ఒ క పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసే చైల్డ్‌ మాఫియా ఆనక వారిని వ్యభిచార గృహాల నిర్వాహకులకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అమ్ముతున్న ట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ బాలికలను తమ పిల్లలుగా వ్యభిచార గృహాల నిర్వాహకులు చెబుతూ ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు తయారు చేస్తూ కొంత కాలం పాఠశాలల్లో చేర్పించి చదువులు నేర్పిస్తారు. వీరికి పదేళ్ల వయస్సు రాగానే కృత్రిమంగా ఎదిగేందుకు హార్మ్లోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం మొదలు పెడతారు. వీటి ప్రభా వం వల్ల 11 ఏళ్ల వయస్సుకే బాలికలు పుష్పవతులు అవడంతో పాటు శారీరకంగా 16, 17 ఏళ్ల వయస్సు వారిగా కనిపిస్తారు. అనంతరం వారిచే బలవంతంగా వ్య భిచారం చేయిస్తారు. ఇది వ్యభిచార గృహాల నిర్వాహకుల దాష్టికంగా చెప్పాలి. వ్యభిచారం చేసేందుకు ఇష్టపడని బాలికలను తీవ్రంగా హింసించడం, గంటల తరబడి కొట్టడం, రోజుల తరబడి భోజనం పెట్టక పోవడం వంటివి చేయడం ద్వారా నిర్వాహకులు బాలికలపై తీవ్రమైన దారుణలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు.
వ్యభిచార గృహాలకు చైల్డ్‌ మాఫియా లింకుపై పోలీసుల ఆరా…దేశ వ్యాప్తంగా దాడులకు సన్నాహాలు
ఇదిలావుండగా యాదగిరి గుట్ట వ్యవహారం వ్యభిచార గృహాలకు చైల్‌ మాఫియాకు లింకు వున్నట్లు తేలడంతో దీనిపై వున్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయసా గారు. వీరి మధ్య లింకు ఎలా కుదిరిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా చైల్డ్‌ మాఫియా బాలలను కిడ్నాప్‌ చేసి పిల్లలు లేని వారికి విక్రయించ డం చాలా కాలంగా వస్తుంది. ఇటువంటి ఉదంతాలు అనేకం వెలుగు చూడగా అనేక ముఠాలు కూడా పట్టుబడ్డాయి. ఇదే సమయంలో బెగ్గింగ్‌ మాఫియాతో చైల్డ్‌ మా ఫియాకు సంబంధాలున్నట్లు ఇప్పటికే తేలగా తాజాగా వెలుగు చూసిన విషయాలు వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధాలున్నట్లు తేలింది. ఇది చాలా ప్రమాదక ర పోకడలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ముక్కుపచ్చలారని బాలికలను చైల్డ్‌ మాఫియా వ్యభిచార రొంపిలోకి దింపడం మరింత గా పెరిగే వీలుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిని మొగ్గలోనే చిదిమి వేయకుంటే మరింత ప్రమాదమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోసా గారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలో ఐదారేళ్లుగా కనిపించకుండా పోయిన బాలికల వివరాలు సేకరించసాగారు. వీరు ఎక్కడ తప్పిపోయారనే వివరాలు సేకరించ డంతో పాటు వీటిపై పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చిందనే దానిపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందులో దొరికిపోయిన బాలికల కేసులు మినహాయిం చి, మిస్టరీగా మారిన కేసులపై దృష్టి సారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇలా కనిపించకుండా పోయిన బాలికలను చైల్డ్‌ మాఫియా కచ్చితంగా వ్యభిచార గృహాల నిర్వాహకులకే అమ్మేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో చైల్డ్‌ మాఫియా భరతం పట్టేందుకు రంగం సిద్దం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుం డా పోయిన బాలికలను చైల్డ్‌ మాఫియా దేశ వ్యాప్తంగా ఎక్కడ విక్రయించారనే దానిపై పోలీసులు ఆరా తీయసాగారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు దేశ వ్యాప్తంగా గల వ్యభిచార గృహాలపై దాడులకు సన్నద్దమవుతున్నారు.