మోదీ ప్ర‌భుత్వంపై ప్ర‌జాధ‌ర‌ణః ద‌త్తాత్రేయ‌

Dattatreya
B. Dattetreya

హైదరాబాద్‌: ఏ రాష్ట్రంపై కూడా కేంద్రం పెత్తనం చేయడం లేదని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ.. మోదీ సర్కార్‌పై గతం కంటే ప్రజాదరణ పెరిగిందన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదేనని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీకి ఆధార్‌ అనుసంధానంతో రూ.25 వేల కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. పంచాయతీరాజ్‌ బిల్లులో కొత్తదనమేమీ లేదన్నారు. కాగ్ నివేదికపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.