మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందలేదు

B V Raghavulu
B V Raghavulu

హైదరాబాద్‌: రూపాయి పతనానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపలంలో సీపీఎం రాష్ట్ర కమిటీ ప్లీనరీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ.. నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందలేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. 2019 ఎన్నికల్లో భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ హామీని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొందని.. ప్రజల బతుకులు మారాలంటే బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రావాలని రాఘవులు అన్నారు.