మోత్కుపల్లిపై రమణ వ్యాఖ్యలు

L.. Ramana
L.. Ramana

హైదరాబాద్‌: టిడిపి సీనియర్‌ నేతపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌.రమణ వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లికి టిటిడిపి పలు అవకాశాలు ఇచ్చి ఆదరించినప్పటికీ తల్లిలాంటి పార్టీకి మోత్కుపల్లి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెడితే పెళ్లికి లేకపోతే చావుకు అన్నట్లు మోత్కుపల్లి ధోరణి అని ఆయన అన్నారు. టిడిపి వ్యక్తులను చూసి భయపడే పార్టీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమానికి మోత్కుపల్లి పిలిస్తే రాలేదని, అప్పటి నుంచి ఏ కార్యక్రమాలకు పిలవలేదని రమణ అన్నారు.