మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

హైదరాబాద్: ఆదర్శ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై రమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్ 16న బాలికను బాబుఖాన్ ఎస్టేట్ లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికైనా చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపైన జూన్ 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.