మేడారానికి భారీగా భక్తుల రాక

medaram
medaram

జయశంకర్‌ భూపాలపల్లి: మేడారం జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటున్నారు. గద్దెల వద్ద భక్తులు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కన్నేపల్లి క్రాస్‌, జంపన్న వాగు సమీపంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండ జంపన్నవాగు వద్దే వాహనాలను నిలపివేస్తున్నారు. మేడారం జాతరకు విచ్చేసే భక్తుల ప్రయాణ సౌకర్యార్ధం టీఎస్‌ఆర్టీఎస్‌ ఆధ్వర్యంలో 4200 ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే.