మేడారం జాత‌ర‌కు వంద కోట్లు కేటాయించాంః ఈటెల‌

eetela
eetela

వ‌రంగ‌ల్ః వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జరగనున్న మేడారం జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో మేడారం జాతరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు జాతరను నిర్వహిస్తామని చెప్పారు. జాతరను నిర్వహించడానికి ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా. గత ప్రభుత్వాలు జాతర నిర్వహణ కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు మాత్రమే నిధులను కేటాయించేవని… తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతర కోసం రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న యాత్రకు ఇప్పటికే రూ. 80 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని చెప్పారు. రానున్న ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది.