మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు: ద.మ.రై

Secunderabad
South Central Railway

గిరిజన కుంభమేళాను మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్‌)16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు 8 ప్రత్యేక రైళ్లు, ఖాజీపేట నుంచి సిర్పూర్‌ కాగజ్‌ వరకు రెండు రైళ్లు, కాగజ్‌ నగర్‌ నుంచి ఖమ్మం వరకు ఆరు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.