మేకకు 500 జరిమానా విధించిన గ్రామ పంచాయతీ

goat
goat

హైదరాబాద్‌: చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలను మేకలు తిన్నాయన్న సమాచారం కార్యదర్శికి అందింది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. సదరు మేక యజమానికి రూ. 500 జరిమానా విధించారు. అంతేకాదు… హరితహారం మొక్కలను నిర్లక్షం చేస్తే ఎవరికైనా ఇటువంటి పరిస్థితే ఎదురవుతుందని గ్రామ కార్యదర్శి చెప్పకనే చెప్పారు. మొత్తంమీద హరితహారం మొక్క తిన్న మేకకు జరిమానా విధించిన విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో తెలిసిన వారు… గ్రామ కార్యదర్శిని అభినందిస్తున్నారు.
కాగా వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ మేక యజమానికి పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/