మెట్రో రెండోదశ కోసం ప్రతిపదిత మార్గాలు

 

METRO
METRO

హైదరాబాద్ : రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టాలని గత సంవత్సరం జనవరి నెలలో నిర్ణయించారు. అందులోభాగంగా నగరం నలుమూలల నుంచి ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ పెంచడంతో పాటు నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాయదుర్గం వరకు 31 కిలోమీటర్లమేర రెందో దశ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26.2 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కిలోమీటర్లు కూడా చేపట్టనున్నారు. కొత్తగా ఉప్పల్ నుంచి మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ మార్గాన్ని చేపట్టే ప్రతిపాదన కూడా ఉన్నది. రాయదుర్గం , గచ్చిబౌలి, టీఎస్ పోలీస్ అకాడమీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు, అదేవిధంగా మియాపూర్ బీహెచ్‌ఈఎల్, మదీనగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, ఖాజాగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతీబౌలీ, మెహిదీపట్నం మీదుగా లక్డీకపూల్‌కు కలుపనున్నారు