మెట్రోతో కాలుష్యం తక్కువ

NVS reddy,metro MD
NVS reddy,metro MD

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మెట్రో ఉపయోగపడుతుందని, రవాణా సాధనంగానే కాక నగరాభివృద్దికి దోహదపడుతుందని మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రోలో భద్రత దృష్ట్యా సిసి కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. మహిళా ప్రయాణికుల కోసం ఓ కోచ్‌లో కొంత భాగాన్ని కేటాయించామని ,డిమాండ్‌ను బట్టి పూర్తి కోచ్‌ను కేటియిస్తామని చెప్పారు. మెట్రోతో కాలుష్యం తగ్గుతుందని అన్నారు. జులైలో ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌, అక్టోబర్‌లో అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ లైన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు.