మూడు స్థానాలు తెలంగాణ కైవ‌సం

TRS CANDIDATES
TRS CANDIDATES

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మూడింటికి మూడు స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. సంతోష్‌కు 32 ఓట్లు, బండ ప్రకాష్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్యయాదవ్‌కు 32 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌కు 11 ఓట్లుతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అసెంబ్లీకి భారీగా చేరుకున్నారు. గన్‌పార్క్‌ నుంచి తెలంగాణభవన్‌కు ర్యాలీగా విజేతలు వెళ్తారు. ఈ ఎన్నికల్లో 108 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 119 కాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 117కు తగ్గింది. వీరిలో 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ(5), సీపీఎం (1), టీడీపీ (2) ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఓటు వేయనని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు.