ముస్లిం రిజ‌ర్వేష‌న్ల కోసం పాద‌యాత్రః ఉత్త‌మ్

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైదరాబాద్: ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతప్పారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అమలు కోసం శనివారం చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకూ 12 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వేషన్ల పెంపుతో రాష్ట్రంలో 10లక్షల మంది ముస్లింలు లబ్దిపొందారని అన్నారు. అసెంబ్లీలో బిల్లు పాసై ఏడు నెలలు కావొస్తున్న ప్రభుత్వం దాని అమలు చేసే ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని అంటుంటే అందుకు ప్రధానిని ఒప్పిస్తానని కేసీఆర్ చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఉత్త‌మ్ అన్నారు.