ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

three students missing in gundla pochampally
three students missing in gundla pochampally

హైదరాబాద్: ముగ్గురు స్కూల్ విద్యార్థులు అదృశ్యమయిన సంఘ‌ట‌న గుండ్లపోచంపల్లిలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఉద‌యం స్కూల్‌కు వెళ్లిన అంతిరెడ్డిరాజు, లోవరాజు, మురళి నాగ బాలాజి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసుస్టేష‌న్లో
ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.