ముగిసిన రెండో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

 

PANCHAYATI
PANCHAYATI

హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండోవిడత నామినేషన్ల ఉపసంహరణ ఈరోజు సాయంత్రం ముగియనుంది. జనవరి 11నుండి 13 వ తేదీ సాయంత్రం ఐదు గంటలవరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించారు. ఈరోజు నామినేషన్ల ఉపసంహరన ముగుస్తుంది. ఈనెల 25న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు, అదేరోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటుంది. ఈ మేరకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో విడతలో జరిగే ఎన్నికల్లోనూ సర్పంచుతోపాటు వార్డుసభ్యులకు పోటాపోటీ నెలకొంది. ఒక్కో గ్రామపంచాయతీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.