మిర్యాలగూడలో జానారెడ్డికి నిరసన సెగ

K. Janareddy
K. Janareddy

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈసమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోంత పార్టీ కార్యకర్తల నుండి ఆయనకు నిరసన సెగ తగిలింది. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్నావారికి కాకుండా స్థానికేతరులైన జానారెడ్డి తనయుడు రఘవీర్‌ ఇటివల పార్టీలో చేరిన అమరేందర్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే ఉరుకునేది లేదని వారు అన్నారు. తొలి నుండి కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్న గిరిజన నేతలు స్కైలాబ్‌ నాయక్, శంకర్‌ నాయక్‌లకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. జానారెడ్డి ఎంత వారించినా శాంతించలేదు. కార్యకర్తల తీరుపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.