మిత్రులే మృగాళ్లు.. యువతిపై అత్యాచారం

Rape on Minor
Rape

హైదరాబాద్‌: నగరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండాకు చెందిన యువతిపై సూడాన్‌కు చెందిన ఆమె మిత్రులే అత్యాచారానికి పాల్పడ్డారు. రేచల్‌ అనే యువతిపై గురువారం మిత్రులు ఉండే ఫ్లాట్‌కి వెళ్లింది. అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. తదనంతరం మద్యం మత్తులో ఇద్దరు మిత్రులు యువతిపై అత్యాచారం చేశారు. బాధితురాలు డయల్‌ 100ఫోన్‌ చేసి జరిగిన ఉదంతాన్ని వెల్లడించింది. పోలీసులు మహమ్మద్‌ ఫాగీర్‌, అమర్‌హుస్సేన్‌ అనే ఇద్దరి అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.