మాదాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

 

Fire Accident
Fire Accident

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ సమీపంలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్‌లో ఖాళీ ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం చెలరేగిన మంటల కారణంగా దాదాపు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అందరూ కూలిపనికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఇక్కడే గుడిసెలు వేసుకొని కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని కాలి పోయిన తమ గుడిసెలు చూసి కుప్పకులిపోయారు. పైసా పైసా కూడా బెట్టుకుని దాచుకున్న సొమ్మంతా కాలిపోవడంతో వారి ఆవేదన