మాజీ ఎంపి జలగం కొండలరావు కన్నుమూత

jalagam kondalarao
jalagam kondalarao

హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు జలగం కొండలరావు ఈ రోజు తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ సియం జలగం వెంగళరావుకు స్వయాన సోదరుడు. ఆయన 1977లో ,1980లో ఖమ్మం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. కొండలరావు మృతి పట్ట సియం కేసిఆర్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతాపం తెలిపారు. జలగం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.