మహిళపై దాడి జరిగిన స్పందన కరవు

Ravula Chandrasekhar reddy
Ravula Chandrasekhar reddy

హైదరాబాద్‌: సీఎం కెసిఆర్‌ కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని టిడిపి సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు అడుగుతున్న కెసిఆర్‌ జాతీయ హోెదా ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నీళ్లు రాకుండా అడ్డుకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. నీతి అయోగ్‌ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడంలో సీఎం విఫలం అయ్యారని ఆరోపించారు. విభజన చట్టం అమలు పరచడంలో కేంద్ర ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చాక మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. నిజామాబాద్‌ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ ఎంపిపి మహిళపై దాడిచేస్తే ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ ఘటనను టిడిపి తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మహిళలపై జరిగే దాడిపై టిడిపి పోరాటం చేస్తుందని రావుల స్పష్టం చేశారు.