మహంకాళి బోనాలకు రావాలని సియంకు ఆహ్వానం

talasani
talasani

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌ను ప్రగతిభవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కలిశారు. మంత్రి తలసానితో పాటు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయ సభ్యులు సియం కేసిఆర్‌ను మహంకాళి బోనాలకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు సియం కేసిఆర్‌ దంపతులకు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సభ్యులు, ఆలయ ఈవో ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.