మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు

T. Harish rao
T. Harish rao

సిద్దిపేట : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై మంత్రి హరీశ్‌రావుపై సిద్దిపేట వన్‌టౌన్‌ ఠాణాలో శుక్రవారం కేసు నమోదైంది. ఈ విషయాన్ని సీఐ నందీశ్వర్‌రెడ్డి  ధ్రువీకరించారు. సిద్దిపేటలో సెప్టెంబరు 30న ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆశీర్వాద సభకు మంత్రి హాజరై విరాళాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జయచంద్రారెడ్డి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 సెక్షన్‌ కింద, ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదైందని సీఐ వెల్లడించారు.