మంత్రి తుమ్మ‌ల‌కు త‌ప్పిన ప్ర‌మాదం!

TUMMALA
TUMMALA

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. దమ్మపేట మండలం అంకంపాలెం శివారులో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని, ఓ వ్య‌క్తి త‌న కారుతో ఓవర్ టేక్ చేయిబోయాడు. అయితే కారు కంట్రోల్ కాకపోవడంతో తుమ్మల కాన్వాయ్‌లోని పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారును గుర్తించారు. కాగా ఆ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు మంత్రి సూచించినట్లు సమాచారం.