భోఫోర్స్‌ గురించి మాట్లాడే హక్కు సీతారామన్‌కి లేదు

V HANUMANTARAO
V HANUMANTARAO

హైదరాబాద్‌: భోఫోర్స్‌ గురించి మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కి లేదని మాజీ ఎంపి వి.హనుమంతరావు అన్నారు. భోఫోర్స్‌ని తెరమీదకు తేలడం సిగ్గుచేటన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాఫెల్‌ విమానాల కొనుగోలుపై దమ్ముంటే జెపిసి వేయాలన్నారు. రాహుల్‌ అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయటం సరికాదన్నారు. బోఫోర్స్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని, రాజీవ్‌ గాంధీకి క్లీన్‌ చీట్‌ వచ్చిందన్నారు. మోడికి కూడా రాఫెల్‌లో అవినీతికి జరగలేదని నిరూపించుకోవాలన్నారు. కెటిఆర్‌ ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ఒక్కసారి గెలవగానే ఈ గెలిపించినట్లు మాట్లాడుతున్నారు. మీ నాయనకు చెప్పు గెలవగానే ఊర్లు తిరుగుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెవరేర్చమని చెప్పు అన్నారు. ఇందిరాగా:ధీ కూడా ఓడిపోయారని, గెలుపు ఓటములు సహజం అన్నారు. బిసిలను రాజకీయగా ఎదగకుండా చేశారన్నారు. బిసి నాయకులు అప్రమత్తం అవ్వాలన్నారు.