భూసేక‌ర‌ణ ద్వారా రైతుల‌కు మెరుగైన న‌ష్ట‌ప‌రిహ‌రంః హ‌రీష్‌రావు

TS Minister Harish Rao
TS Minister Harish Rao

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.కాగా ప్రశ్నోత్తరాల్లో ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన రైతులకు చెల్లించే నష్టపరిహారం, రిజిస్ట్రేషన్ వాల్యూస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి హ‌రీష్‌రావు సమాధానమిస్తూ భూసేకరణ ద్వారా రైతులకు మెరుగైన నష్ట పరిహారం అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వం రూ.60వేల నుంచి రూ.2 లక్షలకు మించి చెల్లించలేదని, అయితే రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్…నష్ట పరిహారాన్ని రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లిస్తున్నారని తెలిపారు. 2017 భూసేకరణ చట్టం కింద రైతుల సమ్మతితోనే భూసేకరణను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్స్ వాల్యూ పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని, రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్ విలువను దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి మంచి ధర ఇవ్వడం జరుగుతుందని ఆయ‌న
తెలిపారు.