భారీగా గంజాయి ప‌ట్టివేత

Ganjai
Ganjai

భ‌ద్రాద్రి కొత్త‌గూడెంః జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ఇవాళ భారీగా గంజాయి పట్టుబడింది. పట్టణంలో పోలీసుల తనిఖీలో భాగంగా గంజాయి బయట పడింది. 500 కిలోల గంజాయితో పాటు బొలెరో వాహనం, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేప‌ట్టారు.