బ్యాలెట్‌ పేపర్‌ను చింపేసిన ఓటరుపై కేసు నమోదు

ballot paper
ballot paper

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఓటరు వింత చర్యకు పాల్పడ్డాడు. ఓటు వేసిన అనంతరం ఓటరు బ్యాలెట్‌ పేపర్‌ను చింపేశాడు. బ్యాలెట్‌ బ్యాక్స్‌లో వేయాల్సిన పేపర్‌ను దానిలో వేయకుండా ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఓటరుపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఓటరు ఆ విధంగా ఎందుకు చేశాడో, అతని మానసిక స్థితి బాగలేకనా, లేదా అలజడి సృష్టించడానికి చేసిన చర్యా? అనే దానిపై పోలీసులు విచారణ చేయనున్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos