బీఎస్‌ఎన్‌ఎల్‌ రక్షా బంధన్‌ ఆఫర్‌

BSNL
BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ రక్షా బంధన్‌ సందర్భంగా ఫ్రి పెయిడ్‌ వినియోగదారులకు కొత్త ఆఫర్లను టెలికాం సర్కిల్‌
సీజీఎం ఎల్‌.అనంతరాం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్టీవి-74, ఎస్టీవి-188, ఎస్టీవి-289, ఎస్టీవి-389
రకాల ఆఫర్లను ప్రకటించింది. వీటిలో ఎస్టీవి-74 ఐదు రోజుల కాలపరిమితిలో పాటు 1జీబీ డేటా, 74 వాయిస్‌
కాల్స్‌, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వర్తిస్తాయి. అదే విధంగా ఎస్టీవి-188 టాక్‌టైం 188తో పాటు మెయిన్‌ బ్యాలెన్స్‌లో
రూ.51, 1జీబీ డేటా ఫ్రీ, 28 రోజుల కాలపరిమితి, ఎస్టీవి-389 పాటు మెయిన్‌ బ్యాలెన్స్‌లో రూ.71, 1జీబీ డేటా
30 రోజుల కాలపరిమితి లభిస్తోందని వివరించారు. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌
టోల్‌ ఫ్రీ నంబర్‌ 1503, 1800-180-1503లను సంప్రదించాలని సూచించారు.