బాస‌ర క్షేత్రంలో భ‌క్తుల ర‌ద్దీ!

basara_saraswati
బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర చదువుల తల్లి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో బాసరకు భక్తులు పోటెత్తారు. ఒక్క రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. సరస్వతి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు. వేదపండితులు వేకువజాము నుంచి అమ్మవారికి సరస్వతి వేదపారాయణం నిర్వహించి మహా హారతి ఇస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసం ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైంది.