ఫ‌లించిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల నిరీక్షణ

telangana police
telangana police

హైద‌రాబాద్ః ఎంతోకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం తీపికబురు చెప్పింది. మొత్తం 122 మంది సీఐలకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(డీఎస్పీ)లుగా పదోన్నతి కల్పించింది. ఈమేరకు పదోన్నతుల ఉత్వర్వులను డీజీపీ అనురాగ్ శర్మ జారీ చేశారు. దీంతో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల నిరీక్షణ ఫలించింది.