ఫోటో లేదని అలకబూనిన దత్తాత్రేయ

B.Dattatreya
B.Dattatreya

హైదరాబాద్‌: అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. తరువాత అమీర్‌పేట నుండి ఎల్బీనగర్‌ ట్రైన్‌లో వెళ్తుండగా దత్తాత్రేయ అలకబూనారు. మెట్రో రైలుపై ప్రధాని మోడి ఫోటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైన్‌ ఎంజీబీఎస్‌ స్టేషన్‌క రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగి వెళ్లిపోయారు.