ఫెడరల్‌ ఫ్రంట్‌ కొత్త డ్రామా

TS PCC CHIEF UTAM
TS PCC CHIEF UTAM

ఫెడరల్‌ ఫ్రంట్‌ కొత్త డ్రామా

అదో మైండ్‌ గేమ్‌: టిఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
రైతులపై మాట్లాడే అర్హత కెసిఆర్‌కు లేదు
ఆర్మూర్‌ సభలో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి, అప్పులతో సర్వనాశనం చేసిన టిఆర్‌ఎస్‌ వచ్చే ఎన్నికల్లో తుడిచి పెట్టుకోవడం ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌లో జరిగిన ప్రజాచైతన్యయాత్ర సభలో ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కెసిఆర్‌ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరమికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపి స్థానం కూడా గెలువలేని టిఆర్‌ఎస్‌పార్టీ జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్‌, ఫెడరల్‌ ఫ్రెంట్‌ అంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు