ఫిబ్రవరి 15లోగా మిడ్‌మానేరు

TS MINISTER HARISH RAO
TS MINISTER HARISH RAO

ఫిబ్రవరి 15లోగా మిడ్‌మానేరు

హైదరాబాద్‌,: మిడ్‌ మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపుతో పాటు అన్ని సివిల్‌, మెకానికల్‌, సాంకేతిక పనులన్ని ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నందున ఆప్రాజెక్టులో మిడ్‌మానేరు పూర్తికావడంఅత్యంత కీలకమన్నారు.

జలసౌధలో శనివారం ఈ ప్రాజెక్టు పనుల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురో గతి, భూ నిర్వాసితుల నష్టపరిహారం, పునరా వాస కార్యక్రమాలను సమీక్షించారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితుల నష్టపరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాంటి అఫిడ విట్లను జారీ చేసిన మండల అధికారులపై క్రిమి నల్‌ కేసులు నమోదుచేయాలని స్పష్టం చేశారు.