ప్లాస్టిక్ క‌వ‌ర్ల వాడ‌కం దారుల‌కు జ‌రిమానా

PENALTY
PENALTY

కామారెడ్డిః 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని.. అవి పర్యావరణానికి హాని చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది. ఐతే.. ఆ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు.. వాటి బదులు సంచులు వాడాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రచారం చేస్తున్నా షాపుల యజమానులు ఇంకా ఆ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని బాన్సువాడలో 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వైన్స్, కిరాణా, చికెన్ సెంటర్ల యజమానులకు మున్సిపల్ కమిషనర్ జరిమానా విధించారు. ఇంకోసారి ప్లాస్టిక్ కవర్లను వాడకూడదంటూ హెచ్చరించారు.