ప్ర‌శాంతంగా టీఆర్‌టి ప‌రీక్ష‌లు

TRT exams
TRT exams

హైద‌రాబాద్ః రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికై తెలంగణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. నేటి నుంచి మార్చి 4 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ రోజు స్కూల్ అసిస్టెంట్, భాష పండిత్- తెలుగు పరీక్ష జరుగనుంది. ఫిబ్రవరి 25న ఎస్‌జీటీ- తెలుగు, ఆంగ్లం పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 26న స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం పరీక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 27న స్కూల్ అసిస్టెంట్ సామాన్యశాస్త్రం పరీక్ష, స్కూల్ అసిస్టెంట్ భాషా పండిత్- ఉర్దూ, మరాఠీ, హిందీ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 28న స్కూల్ అసిస్టెంట్ హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ పరీక్షలు జరుగుతాయి. ఇదే రోజు(ఫిబ్రవరి 28న) పీఈటీ- తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ పరీక్షలు ఉండనున్నాయి. మార్చి 2న ఎస్‌జిటి- తెలుగు, హిందీ, ఉర్దూ, బెంగాళీ, కన్నడ, మరాఠీ పరీక్షలు… స్కూల్ అసిస్టెంట్- ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉండనుంది. మార్చి 3న స్కూల్ అసిస్టెంట్- జీవశాస్త్రం, గణితం, సాంఘీక శాస్త్రం పరీక్షలు… స్కూల్ అసిస్టెంట్- భౌతిక శాస్త్రం ఆంగ్ల మాద్యమం పరీక్ష ఉంటుంది. మార్చి 4న స్కూల్ అసిస్టెంట్- గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షలు… పీఈటీ- ఆంగ్ల మాద్యమం పరీక్ష జరుగుతుంది.