ప్ర‌జ‌ల సంక్షేమం కోసం రూ.45వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాంః మంత్రి తుమ్మ‌ల‌

ts minister tummala-nageswara-rao
ts minister tummala-nageswara-rao

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు చేస్తోన్న పలు విమర్శలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు.
బుధవారం ఖమ్మంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్షాలే
సంక్షోభంలో ఉన్నాయని, . తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ వేతనాలు పెరిగాయని, ప్రజల
సంక్షేమం కోసం రూ.45వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, విద్యుత్‌ సంక్షోభాన్ని
అధిగమించామని, రాష్ట్రం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందని ఆయ‌న అన్నారు.