ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలి: తుమ్మల

TS Minister Tummala
TS Minister Tummala

ఖమ్మం: ఖమ్మానికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు సియం కేసిఆర్‌ సిద్దంగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముస్లింల అభ్యున్నతికి సియం కేసిఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని తుమ్మల తెలిపారు. ముస్లింల సంక్షేమానికి సియం రూ. 2 వేల కోట్లు కేటాయించారన్న మంత్రి గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయన్నారు. ఖమ్మం పట్టణంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినామన్నారు. ప్రతి పక్షాలు అధికార దాహంతోనే అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.