ప్రతి మండలానికి గోదాంలు నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్‌దే: హరీష్‌రావు

ts Harishrao
ts minister Harishrao

నల్గొండ: గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా నల్గొండ
పట్టణంలో రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మట్లాడుతూ ప్రతి మండలానికి గోదాంలు నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్‌దే
అని, ఇన్నేళ్లలో కాంగ్రెస్‌ 11వేల మెట్రిక్‌ టన్నుల గోదాములే నిర్మించిందని, కాని తాము అధికారంలోకి వచ్చాక మూడేళ్లలోనే 2.35
లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వచేసే గోదాంలు నిర్మించారని తెలిపారు. అలాగే రాబోయే నెల రోజుల్లో బత్తాయి మార్కెట్‌ నిర్మాణం పూర్తి
చేస్తామని, చాలా జిల్లాల్లో రైతులు సాగుకు 24గంటల విద్యుత్‌ వద్దంటున్నారని, రైతుల డిమాండ్‌ మేరకు 12గంటల విద్యుత్‌ సరఫరాపై
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని ఆయన అన్నారు.