ప్రజాధ‌నం దుర్వినియోగం కాకుండా ఆధార్ లింకుః కెటిఆర్

ktr
ktr

హైదరాబాద్‌: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిలువరించేందుకే ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం చేస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఫారుక్‌ హుస్సేన్‌, సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే వంద శాతం ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. నేరుగా లబ్ధిదారులకు చేరే సంక్షేమ పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామావళిని అనుసరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నియమ నిబంధనలను రూపకల్పన చేసి సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చూసేందుకు అనుసంధానం చేస్తామని మంత్రి వివరించారు.